Nov 03,2023 22:30

నెదర్లాండ్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
లక్నో: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు తొలిసారి నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలపై ఇప్పటికే నెగ్గిన ఆఫ్ఘన్‌ జట్టు నేడు.. నెదర్లాండ్స్‌పై గెలిచి 8 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకింది. లక్నోలో నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ జట్టు ఆఫ్ఘన్‌ బౌలర్ల ధాటికి 46.3ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. ఆ లక్ష్యాన్ని ఆఫ్ఘన్‌ జట్టు 31.3ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది(56నాటౌట్‌) జట్టును ముందుండి నడిపించాడు. రహ్మత్‌ షా(52), అజ్మతుల్లా ఒమర్జారు(31నాటౌట్‌) సత్తా చాటాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలోలో వాన్‌ బీక్‌, వాన్‌ డెర్‌ మెర్వ్‌, సకీబ్‌ జుల్ఫికర్‌ వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ను తొలినుంచే ఆఫ్ఘన్‌ బౌలర్లు కట్టడి చేశారు. సైబ్రాండ్‌(58) అర్ధసెంచరీకి తోడు అకెర్మన్‌(29), మ్యాక్స్‌ ఓవుడ్‌(42) టాప్‌ స్కోరర్స్‌. వీరు ముగ్గురు ఔటయ్యేసరికి నెదర్లాండ్స్‌ 19.3ఓవర్లలో 92పరుగులు చేసి పటిష్టంగా ఉంది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ బౌలర్లు వరుసగా వికెట్లు కూల్చి ఊపిరిసలపనివ్వలేదు. స్టార్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ ఎడ్వర్డ్స్‌(0)కి తోడు లీడే(3), సకీబ్‌(3), వాన్‌ బీక్‌(2) స్వల్పస్కోర్లకే పెవీలియన్‌కు పంపారు. దీంతో నెదర్లాండ్స్‌ 113పరుగులకే 6వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆఫ్ఘన్‌ బౌలర్లు రాణించారు. నబీ(3/28), నూర్‌ అహ్మద్‌(2/31), ముజీబ్‌(1/40)కి తోడు నలుగురు బ్యాటర్స్‌ను రనౌట్‌ చేసి నెదర్లాండ్స్‌ను కట్టడి చేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మహ్మద్‌ నబి లభించింది.

స్కోర్‌బోర్డు...
నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: బర్రెసి (ఎల్‌బి)ముజీబ్‌ 1, ఓవర్డ్‌ (రనౌట్‌) అజ్మతుల్లా 42, అకెర్మన్‌ (రనౌట్‌)రషీద్‌/క్రామ్‌ 29, సైబ్రాండ్‌ (రనౌట్‌)నబి/ఇక్రామ్‌ 58, ఎడ్వర్డ్‌ (రనౌట్‌) ఇక్రామ్‌ 0, లీడే (సి)ఇక్రామ్‌ (బి)నబి 3, షకీబ్‌ (సి)ఇక్రామ్‌ (బి)నూర్‌ అహ్మద్‌ 3, వాన్‌ బిక్‌ (స్టంప్‌)ఇక్రామ్‌ (బి)నబీ 2, వాన్‌ాడెర్‌ామెర్వ్‌ (సి)ఇక్రామ్‌ (బి)నూర్‌ అహ్మద్‌ 11, ఆర్యన్‌ (నాటౌట్‌) 10, వాన్‌ మీకెరన్‌ (ఎల్‌బి)నబి 4, అదనం 18. (46.3ఓవర్లలో ఆలౌట్‌) 179పరుగులు.
వికెట్ల పతనం: 1/3, 2/92, 3/92, 4/92, 5/97, 6/113, 7/134, 8/152, 9/169, 10/179
బౌలింగ్‌: ముజీబ్‌ 10-0-40-1, ఫారూఖీ 5-0-36-0, అజ్మతుల్లా 3-0-11-0, నబి 9.3-1-28-3, రషీద్‌ ఖాన్‌ 10-0-31-0, నూర్‌ అహ్మద్‌ 9-0-31-2.
ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి)ఎడ్వర్డ్స్‌ (బి)వాన్‌ాబెక్‌ 10, ఇబ్రహీం జడ్రాన్‌ (బి)వాన్‌ాడెర్‌ామెర్వ్‌ 20, రామత్‌ షా (సి అండ్‌ బి)షకీబ్‌ జులిఖర్‌ 52, హజ్మతుల్లా (నాటౌట్‌) 56, అజ్మతుల్లా (నాటౌట్‌) 31, అదనం 12. (31.3ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 181పరుగులు.
వికెట్ల పతనం: 1/27, 2/55, 3/129
బౌలింగ్‌: ఆర్యన్‌ దత్‌ 8.3-0-49-0, వాన్‌-బీక్‌ 7-0-30-1, మీకెరన్‌ 5-0-35-0, వాన్‌-డెర్‌-మెర్వ్‌ 5-0-27-1, సకీబ్‌ 3-0-25-1, అకెర్మన్‌ 3-0-12-0
వన్డే ప్రపంచకప్‌లో నేడు
పాకిస్తాన్‌ × న్యూజిలాండ్‌
(వేదిక: బెంగళూరు, ఉ.10.30గం||లకు)
ఇంగ్లండ్‌ × ఆస్ట్రేలియా
(వేదిక: అహ్మదాబాద్‌; మ.2.00గం||లకు)