
ముంబయి: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో నేడు(నవంబర్ 01న) టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బిసిసిఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్ ఆషిష్ షెలార్‌లతో పాటు ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎంసిఎ) ప్రతినిధులు హాజరుకానున్నారు. వాంఖేడే స్డేడియంలో సచిన్ టెండూల్కర్ స్టాండ్‌కు ఆనుకుని ఉండేచోట ఈ విగ్రహాన్ని ఉండనుంది. ఇక సచిన్ టెండూల్కర్ 50వ పుట్టినరోజు సందర్భంగా వాంఖడేతో అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంసిఏ ఇంతకుముందే ప్రకటించింది. భారత క్రికెట్‌కు అతడు చేసిన సేవలకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లీ ఈ విగ్రహాన్ని సచిన్ లెగసీకి నివాళిగా తీర్చిదిద్దినట్టు చెప్పాడు. కాగా సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 100సెంచరీలతో పాటు వన్డేల్లో డబుల్ సెంచరీ(2010) కొట్టిన తొలి క్రికెటర్.