Oct 27,2023 22:05

హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో జమ్ముాకాశ్మీర్‌కు చెందిన 16ఏళ్ల శీతల్‌ దేవి సంచలనం సృష్టిస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించింది. అలాగే మహిళల డబుల్స్‌లోనూ రజత పతకం చేజిక్కించుకొని ఆర్చరీలో మూడు పతకాలు సాధించిన తొలి పారా క్రీడాకారిణిగా నిలిచింది. గత వారం సింగిల్స్‌ విభాగంలో స్వర్ణం నెగ్గిన షీతల్‌.. నేడు సాధించిన పతకాలతో హ్యాట్రిక్‌ పతకాలను సొంతం చేసుకుంది. రెండు చేతుల్లేని శీతల్‌ ఆర్చరీలో కాళ్లతోనే విల్లంబులను సంధించి పతకాలను కొల్లగొట్టడం విశేషం. శుక్రవారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో శీతల్‌ 144-142పాయింట్ల తేడాతో సింగపూర్‌కు చెందిన అలీమ్‌ానూర్‌, సయాహిదాను ఓడించింది. ఇక ఎస్‌ఎల్‌ా3 పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ప్రమోద్‌ భగత్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో ప్రమోద్‌ 22-20, 21-19తో భారత్‌కే చెందిన నితీశ్‌కుమార్‌ను చిత్తుచేశాడు. ఇక ఎస్‌ఎల్‌-3, ఎస్‌ఎల్‌ఎప్‌-4 నితీశ్‌-తరున్‌ జోడీ స్వర్ణ పతకాన్ని ముద్దాడగా.. ప్రమోద్‌ భగత్‌ాసుకాంత్‌ జోడీ కాంస్య పతకానికే పరిమితమైంది. పారాలింపిక్‌ ఛాంపియన్‌ కృష్ణ నగర్‌ ఎస్‌హెచ్‌-6లో 10-21, 21-8, 11-21తో ఫైనల్లో హాంకాంగ్‌కు చెందిన ఛుామన్‌-కి చేతిలో ఓడి రజత పతకంతో సంతృప్తి చెందాడు.
1500మీ. పరుగులో రమన్‌ శర్మ రికార్డు
పురుషుల టిా38 1500మీ. పరుగులో రమన్‌ శర్మ ఆసియా గేమ్స్‌ రికార్డు నెలకొల్పాడు. రమన్‌ 4నిమిషాల 20:80సెకన్లలో గమ్యానికి చేరి ఈ ఫీట్‌ను సాధించాడు. ఇక జావెలిన్‌ ఎఫ్‌-54లో ప్రదీప్‌ కుమార్‌ (25.94మీ.), లక్షిత్‌(21.20మీ.) ఈటెలను విసిరి రజత, కాంస్య పతకాల్ని చేజిక్కించుకోగా... మహిళల డిస్కస్‌ త్రో ఎఫ్‌ా37.38లో లక్ష్మి 22.55మీ. విసిరి కాంస్య పతకాన్ని ముద్దాడింది. పురుషుల ఆర్చరీ షూట్‌ ఆఫ్‌లో రాకేశ్‌ కుమార్‌ 144(10)-144-(9)తో ఇరాన్‌కు చెందిన అలిసిన్‌ చేతిలో ఓడి రజత పతకానికే పరిమితమయ్యాడు. దీంతో భారత్‌ 99 పతకాలతో 6వ స్థానంలో ఉంది.
పతకాల పట్టిక
వ.స  దేశం  స్వ   ర    కా మొ
1.    చైనా 195 159 138 492
2.   జపాన్‌ 39 43 56 138
3.   ఇరాన్‌ 39 39 37 115
4.   ద.కొరియా 28 30 37 95
5.  ఇండోనేషియా 26 21 32 79
6.  ఇండియా 25 29 45 99
7.  థాయ్ లాండ్‌ 25 22 48 95
8.  ఉజ్బెకిస్తాన్‌ 24 23 25 72
9.  కజకిస్తాన్‌ 8 12 21 41
10.  హాంకాంగ్‌ 7 15 22 44