
ఎలిగేడు (పెద్దపల్లి) : రాఖీ పండుగ వేళ ... సంతోషంగా ఉన్న అన్న... కళ్లముందే గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో సోదరి తీవ్ర దు:ఖంతో అన్న మృతదేహానికి రాఖీ కట్టింది. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టలో చౌదరి కనకయ్య అనే యువకుడికి రాఖీ కట్టేందుకు ఎంతో సంతోషంగా అతడి సోదరి గౌరమ్మ వచ్చింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న అన్న ... ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయి విగతజీవిగా మారాడు. దీంతో గౌరమ్మ గుండెలవిసేలా రోదించింది. తీవ్ర ద్ణుఖంతోనే తన అన్న మఅతదేహానికి కడసారి సోదరి రాఖీ కట్టింది. ఇదంతా చూసిన గ్రామస్తులలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబమంతా శోకసంద్రమయ్యింది.