ముంబయి : బాలీవుడ్లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) బుధవారం ఉదయం తన స్టూడియోలో ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి నితిన్ దేశాయ్ తన స్టూడియోకు వెళ్లి అక్కడే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. నితిన్ దేశాయ్ పనిచేసిన ఎన్నో సినిమాలను జాతీయ అవార్డులు వరించాయి. హిందీ, మరాఠి భాషల్లో స్టార్ హీరోల సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లగాన్, దేవదాస్ (2002), జోదా అక్బర్ వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా నితిన్ సేవలందించారు. వీటికి గానూ ఆయన నాలుగు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. కేవలం ఆర్ట్ డైరెక్టర్‌గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా రెండు సినిమాలకు పనిచేశారు. నటుడిగా నాలుగు సినిమాల్లో కనిపించారు.