
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు మరో ఓటమిని చవిచూసింది. జార్ఖండ్‌లోని జెఎసిఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో రైల్వేస్‌తో శుక్రవారం జరిగిన పోటీలో ఆంధ్రజట్టు 53పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 171పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఉపేంద్ర యాదవ్(51నాటౌట్), అశుతోష్ శర్మ(43), ప్రథమ్ సింగ్(32) బ్యాటింగ్‌లో రాణించారు. విజరుకు రెండు, మనీష్, సాయితేజకు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో ఆంధ్రజట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్లు కోల్పోయి 118పరుగులే చేసింది. శ్రీకర్ భరత్(31), తపస్వి(19), రషీద్(19) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. రాజ్ చౌదరికి నాలుగు, యువరాజ్‌సింగ్‌కు మూడు వికెట్లు దక్కాయి. దీంతో గ్రూప్‌ాసిలో ఆంధ్రజట్టు 6మ్యాచ్‌లు ముగిసేసరికి 12పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.
హైదరాబాద్ ఖాతాలో మరో విజయం
గ్రూప్‌ాఏలో హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. హర్యానాతో శుక్రవారం జరిగిన పోటీలో హైదరాబాద్ జట్టు 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన హర్యానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 139పరుగులు చేసింది. రక్షణ్‌కు మూడు, తన్మరు త్యాగరాజన్, మిలింద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో హైదరాబాద్ జట్టు 15.4 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 141పరుగులు చేసి గెలిచింది. తన్మరు అగర్వాల్(27), రాహుల్‌సింగ్(26నాటౌట్), రోహిత్ నాయుడు(23) వ్యాటింగ్‌లో రాణించారు. దీంతో హైదరాబాద్ గ్రూప్‌ాఎలో 7మ్యాచ్‌లు ముగిసేసరికి 24పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
వరుసగా 6అర్ధసెంచరీలతో రియార్ రికార్డు..
అస్సాం బ్యాటర్ రియాన్ పరాగ్ నయా చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వరుసగా 6మ్యాచుల్లో 6అర్ధసెంచరీలు కొట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డుపుటల్లోకెక్కాడు. శుక్రవారం కేరళ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రియాన్ 33బంతుల్లో 57(నాటౌట్) బ్యాటింగ్‌లో మెరిసి కేరళ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో కేరళ 19.3ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.