ప్రముఖ కవి, విమర్శకులు, ప్రతిష్టాత్మక ఉమ్మడి శెట్టి అవార్డు వ్యవస్థాపకులైన డా.రాధేయకు నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి అమృతలత జీవన సాఫల్య పురస్కారం -2023 ప్రకటించారు. మార్చి 5వ తేదీన నిజామాబాద్‌లో ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. గత యాభై ఏళ్లుగా కవిత్వం రాస్తూ, ముప్పై అయిదేళ్లుగా ఉత్తమ కవిత్వానికి ఉమ్మడిశెట్టి అవార్డులను ప్రదానం చేస్తున్నందుకు గానూ రాధేయని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సంస్థ ప్రకటించింది.










