Jul 24,2023 07:47

నడిచే దేవతల్ని
నగ్నంగా చేసి
నడి వీధిలో ఊరేగించారు
వివస్త్రను చెయ్యడమేదో
వీరోచిత కార్యంలా
కేరింతలు కొట్టినారు
తలదించిన ఆ దేవతలు
ఒకరు నాగరికత
మరియొకరు మానవత!
వెంటాడిన ఆ గుంపులు
ఒకటి రాజకీయం
మరియొకటి విద్వేషం!
ఆధునిక దేశంలో...
అమృత కాలంలో ...!
 

- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ,
94408 36931