Aug 08,2023 14:51

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ప్రముఖ ఫర్నీచర్‌, హౌమ్‌ డెకార్‌ ఈకామర్స్‌ సంస్థ సిఈవో, పెప్పర్‌ ఫ్రై కో-ఫౌండర్‌ అంబరీష్‌ మూర్తి గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు పెప్పర్‌ ఫ్రై మరో కో ఫౌండర్‌ ఆశిష్‌ ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. అంబరీష్‌కి రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. ఢిల్లీ నుంచి లేహ్ కి అంబరీష్‌ బైక్‌ రైడింగ్‌ వెళ్లారు. అక్కడే అందరూ చూస్తుండగానే గుండెపోటుతో మృతి చెందారు అని ఆశిష్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, 2012లో అంబరీష్‌ మూర్తి, అశిష్‌తో కలిసి పెప్పర్‌ఫ్రైను స్థాపించారు. 2020 నాటికి ఆ సంస్థ విలువ 500 మిలియన్లుగా ఉంది. అదే ఏడాది 8 రౌండ్లలో 244 మిలియన్ల పెట్టుబడులన్ని సంపాదించింది. వారు ఇన్వెస్ట్‌ చేసిన సంస్థల్లో గోల్డ్‌మన్‌ సాచ్స్‌, బెర్టెల్స్‌మాన్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. క్రంచ్‌ బేస్‌ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుండి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ను అంబరీష్‌ పూర్తి చేశారు. ఐఐటీ కోల్‌కత్తా పూర్వ విద్యార్ధి.