న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండిస్టీస్ బోర్డులోకి ఆ సంస్థ ఛైర్మన్ ముకేష్ అంబానీ పిల్లలు అయినా ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, ఈశా అంబానీలను తీసుకున్నారు. వీరిని డైరెక్టర్ల బోర్డులో చేర్చుకున్నట్లు ఆ సంస్థ శుక్రవారం తెలిపింది. గత నెలలో రిల్ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎం)లో ఈ విషయమై ముకేష్ అంబానీ ప్రకటన చేయగా.. తాజాగా వాటాదారుల నుంచి ఆమోదం లభించింది. ముగ్గురు వారసులకు కూడా గత కొన్ని ఏళ్లుగా రిలయన్స్ గ్రూపులోని కంపెనీల్లో కీలక బాధ్యతలను అప్పగించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న అంబానీ ముగ్గురు పిల్లలకు జీతాలు చెల్లించడం లేదని ఆ సంస్థ పేర్కొంది.