Oct 10,2023 21:25

హైదరాబాద్‌ : ప్రస్తుత పండుగ సీజన్‌లో వినియోగదారులకు మరింత వేగంగా సేవలను అందించడానికి అమెజాన్‌ ఇండియా కొత్తగా 12 మంది డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ (డిఎస్‌పి)లతో జట్టు కట్టినట్లు పేర్కొంది. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ ఎన్‌సిఆర్‌, మహారాష్ట్ర వ్యాప్తంగా తన డిఎస్‌పి కార్యక్రమంలో భాగంగా డెలివరీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆన్‌బోర్డ్‌ చేసుకున్నామని ఆ సంస్థ ప్రకటించింది. పండుగ సీజన్‌ సమయంలో అమెజాన్‌ ఇండియా లాస్ట్‌ మైల్‌ నెట్‌వర్క్‌ను ఈ కార్యక్రమం బలోపేతం చేస్తుందని పేర్కొంది. ఇప్పటికే 300 మంది చిన్న, మధ్య తరహా ఔత్సాహికవేత్తలతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలిపింది.