Mar 07,2023 20:34
  • 200 విక్రేతలకు గ్లోబల్‌ గుర్తింపు

న్యూఢిల్లీ : దేశంలో 200 మంది మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఇవ్వడానికి గ్లోబల్‌ ఇంక్యుబేటర్‌ అయిన 'ఉమెన్‌నోవేటర్‌'తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు అమెజాన్‌ ఇండిమా తెలిపింది. అమెజాన్‌ రానున్న 24 నెలల పాటు నిర్వహించనున్న తన ఇ-కామర్స్‌ ఎగుమతుల కార్యక్రమం గ్లోబల్‌ సెల్లింగ్‌లో విక్రేతలుగా 'ఉమెన్నోవేటర్‌'లో 200 మంది మహిళా వ్యాపారవేత్తలను ఆన్‌బోర్డ్‌ చేయనున్నట్లు పేర్కొంది. దేశం నుంచి గ్లోబల్‌ బ్రాండ్‌లను రూపొందించేందుకు మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ భాగస్వామ్యం ఈ సహాయం చేస్తుందని పేర్కొంది. ఇందుకోసం మహిళ ఔత్సాహికవేత్తలతో కలిసి పని చేయనున్నట్లు తెలిపింది.