Sep 04,2023 20:47

న్యూఢిల్లీ : భారత్‌లో ప్రకృతి ఆధారిత ప్రాజెక్టుల్లో ప్రాథమికంగా మూడు మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.24 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వెల్లడించింది. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో ప్రకృతి ఆధారిత ప్రాజెక్టులకు కేటాయించిన 15 మిలియన్‌ డాలర్ల నుంచి వీటిని వ్యయం చేయనున్నట్లు పేర్కొంది. తొలుత పశ్చిమ కనుమల్లోని జీవ వైవిధ్య సంరక్షరణకు గాను సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ స్టడీస్‌తో కలిసి పని చేయనున్నట్లు వెల్లడించింది. ఆసియా పులులు, ఏనుగులు అత్యధికంగా ఈ ప్రాంతంలోనే ఉన్నాయని పేర్కొంది. అదే విధంగా పళ్లు, కలపతో పాటు ఔషధ గుణాలున్న చెట్లను నాటి, సంరక్షించేలా రైతులకు సాయం అందించనున్నట్లు తెలిపింది.