Oct 09,2023 21:54

న్యూయార్క్‌ : ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మరోమారు ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ దఫా కమ్యూనికేషన్‌ విభాగాల్లోని సిబ్బందిపై వేటు వేయాలని నిర్ణయించడంతో అమెజాన్‌ స్టూడియోస్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, అమెరికా మ్యూజిక్‌ డివిజన్స్‌ ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. ఈ కమ్యూనికేషన్‌ విభాగాల్లో 5 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించనుంది డెడ్‌లైన్‌ రిపోర్ట్‌ చేసింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు 60 రోజుల పాటు రెగ్యులర్‌ పే, ఇతర బెనిఫిట్స్‌ను పొందుతారని కంపెనీ పేర్కొంది. జాబ్‌ ప్లేస్‌మెంట్‌ అసిస్టెన్స్‌తో పాటు లేఆఫ్స్‌ బాధితులు పరిహార ప్యాకేజ్‌కు అర్హులని వెల్లడించింది. 2022 నవంబర్‌ నుంచి 2023 జనవరి వరకూ అమెజాన్‌ ఏకంగా 18వేల మంది ఉద్యోగులను తొలగించింది.