న్యూఢిల్లీ : అమెజాన్ ఫ్రైమ్ భారీగా ధరలు పెంచుతూ తమ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. నెలవారీ చందాను ఏకంగా 67 శాతం పెంచి రూ.299కు చేర్చింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని గురువారం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇది రూ.179గా ఉంది. మూడు నెలల చందా ధరను రూ.459 నుంచి 599కి చేర్చింది. ఏడాది చందా ధరను యథాతథంగా రూ.1499గా కొనసాగించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి 2024 జనవరి వరకు పాత ధరలనే అమలు చేయనున్నట్లు వెల్లడించింది.










