Oct 07,2023 21:10

బెంగళూరు : ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2023 అక్టోబర్‌ 8నుంచి ప్రారంభం కానుంది. ఫ్రైమ్‌ సభ్యులకు 24 గంటల ముందే ఈ సౌలభ్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. 5,000పైగా ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది. సామ్‌సంగ్‌ ఉత్పత్తులపై, ఇంటెల్‌ ల్యాప్‌ట్యాప్‌లు, సోనీ ప్లే స్టేషన్‌5, ల్యాక్‌మీ, హైసెన్స్‌ టివిలు, ఎల్‌జి ఉత్పత్తులు తదితర వాటీపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అమెజాన్‌ పే వ్యాలెట్‌తో షాపింగ్‌ చేయడం ద్వారా రూ.1000 గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.