Oct 05,2023 21:05
  • సిఫార్సు రుసుంపై 50 శాతం తగ్గింపు

హైదరాబాద్‌ : ప్రస్తుత పండగ సీజన్‌లో కొత్త విక్రేతలను ఆకట్టుకోవడానికి అమెజాన్‌ ఇండియా ప్రణాళికలు రూపొందించింది. నవంబర్‌ 4లోపు రిజిస్టర్‌ చేసుకునే కొత్త విక్రేతలకు సిఫార్సు రుసుములపై 50 శాతం మినహాయింపును అందిస్తున్నామని అమెజాన్‌ ఇండియాలో సెల్లింగ్‌ పార్టనర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అమిత్‌ నందా అన్నారు. వారు అమెజాన్‌ లో చేరిన తేదీ నుండి 60 రోజుల వరకు ఇది చెల్లుబాటులో ఉంటుందన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రేట్‌ ఇండియన్‌ రెఫరల్‌ ఆఫర్‌లో వ్యాపారులు తమ స్నేహితులను విక్రయించడానికి సిఫార్సు చేయడం ద్వారా రూ.11,500 విలువైన రివార్డ్‌లను పొందవచ్చన్నారు. దేశ వ్యాప్తంగా తమ వేదికపై 14 లక్షల మంది విక్రేతలు నమోదై ఉండగా.. తెలంగాణ నుండి 50,000 కంటే ఎక్కువ చిన్న వ్యాపారాలు ఉన్నారన్నారు. నూతన విక్రేతల కోసం లైవ్‌ శిక్షణలను కూడా నిర్వహిస్తుందన్నారు. ఉచిత వెబ్‌నార్లు నూతన విక్రేతలకు మార్కెట్‌లో లిస్టింగ్‌లు, షిప్పింగ్‌, ప్రైమ్‌, డీల్స్‌, కూపన్‌లు తదితర మరెన్నో అవగాహనతో పాటు వారి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు.