Mar 23,2023 16:35

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌(తిరుపతి) : యువత అంతా భగత్‌ సింగ్‌ అడుగుజాడల్లో నడవాలని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షులు ఆర్‌ వెంకటేష్‌ పేర్కొన్నారు. భగత్‌ సింగ్‌ విప్లవ వీరుడు ఆదర్శమూర్తి భగత్‌ సింగ్‌ 92వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం పుత్తూరు డిగ్రీ కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ వెంకటేష్‌, డిగ్రీ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ నరసింహులు మాట్లాడుతూ.. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన భారతరత్నాలు సర్దార్‌ భగత్‌ సింగ్‌ అని కొనియాడారు. స్వాతంత్ర సంగ్రామంలో విరోచితమైన పోరాటాల నిర్వహించారన్నారు. భారత యువత అంతా ఆదర్శ ప్రాయంగా భగత్‌ సింగ్‌ అర్గజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మన దేశ సంపద అంతా పెద్దపెద్ద కార్పొరేట్‌ శక్తులకు అప్పచెబుతున్నారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పుత్తూరు కార్యదర్శి హరి, దేవా, దేవేంద్ర, రాజేష్‌, అమ్మాయిలు అబ్బాయిలు తదితరులు పాల్గొన్నారు.