Sep 14,2023 22:05

ప్రి క్వార్టర్స్‌లో మహిళల డబుల్స్‌ జోడీలు పరాజయం
కాలూన్‌(హాంకాంగ్‌): హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తొలిరౌండ్‌లోనే అందరూ నిష్క్రమించగా.. మహిళల డబుల్స్‌లో రెండు జోడీలు ప్రి క్వార్టర్స్‌కు చేరాయి. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లో తానీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప, గాయత్రి గోపీచంద్‌-త్రీసా జోలీ జంట ఓటమిపాలయ్యాయి. తొలి మ్యాచ్‌లో గాయత్రి-త్రీసా జోలీ 8-21, 14-21తో మలేషియాకు చెందిన రమాధంతి-రహాయు చేతిలో కేవలం 36నిమిషాల్లోనే ఓడారు. ఇక తానీషాాఅశ్విని జోడీ 18-21, 7-21తో జపాన్‌కు చెందిన మట్సుమోటో-నగహరా చేతిలో వరుససెట్లలో ఓడారు. ఈ మ్యాచ్‌ కేవలం 38 నిమిషాల్లోనే ముగిసింది.