- రోడ్డుపై మున్సిపల్ కార్మికుల వంటా వార్పు
- సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్
ప్రజాశక్తి - పల్నాడు : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్ , ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాల ముట్టడిస్తామని సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు స్కిల్, సెమీస్కిల్ వేతనాలను అమలు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లతో మున్సిపల్ వర్కర్స్ డ హెల్పెర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు రీలే దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజలెవ్వరూ బయటకు రాలేని పరిస్థితులలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి పని చేశారని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. క్లాప్ డ్రైవర్లకు రూ.18500/ వేతనాలు ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా దశల వారి పోరాటంలో భాగంగా ఈరోజు నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్యాలయానికి తలుపులు వేసి ముట్టడి కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనకు పిడిఎం నాయకులు నల్లపాటి రామారావు, ప్రగతిశీల కార్మిక సమస్య నాయకులు కంభాల ఏడుకొండలు, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిలార్ మసూద్ సంఘీభావం తెలిపారు. మున్సిపల్ వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరారపు సాల్మన్ నరసరావుపేట మున్సిపల్ అధ్యక్ష, కార్యదర్శులు తాతపూడి మల్లయ్య, పిట్ట ఏసు, వీర కుమార్, కే.ప్రసాద్, సాల్మన్, నరసింహారావు, ఇశ్రాయేలు, హుస్సేనమ్మ, విజయలక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.












