Aug 26,2023 21:40

బుడాపెస్ట్‌(హంగేరీ): గత అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రజిత పతకానికే పరిమితమైన నీరజ్‌ చోప్రా ఈసారి ఏకంగా బంగారు పతకంపై కన్నేశాడు. ఈ క్రమంలో క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో నీరజ్‌ చోప్రా ఒక్క త్రో వేసి ఫైనల్లో బెర్త్‌తోపాటు పారిస్‌-2024 ఒలింపిక్స్‌కూ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే 88.77మీటర్లు విసిరి మిగతా త్రోయర్స్‌కంటే అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే 2018 ఆసియా క్రీడల్లో పాకిస్తాన్‌కు చెందిన నదీమ్‌ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్న నీరజ్‌.. తొలిసారి బంగారు పతకాన్ని చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇక పాకిస్తాన్‌ జావెలిన్‌ త్రోయర్‌ నదీమ్‌ ఆర్షాద్‌ ట్విటర్‌ వేదికగా భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాతో తనకెలాంటి వృత్తిపరమైన వైరం లేదని స్పష్టం చేశాడు. భారత్‌ తరఫున సత్తా చాటుతున్న నీరజ్‌ చోప్రా వంటి అగ్రశ్రేణి అథ్లెట్ల నుంచి నేర్చుకునేందుకు తానెప్పుడూ సిద్ధమేనని తెలిపాడు. ''నేను ఎవరితోనూ పోటీ పడను. నాతో నేను పోటీ పడతాను. ఇంకా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాను. నీరజ్‌ చోప్రాతోనూ ఇంతే... జావెలిన్‌ క్రీడాంశంలో అతడితో ఎలాంటి పోటీ లేదు'' అని వివరించాడు. 25ఏళ్ల నీరజ్‌తోపాటు