Apr 19,2023 21:02

హైదరాబాద్‌ : ప్రముఖ అభరణాల రిటైల్‌ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమాండ్స్‌ తన బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటీ అలియా భట్‌ను నియమించుకుంది. అలియా అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోందని.. ఆమె తమ సంస్థకు మరింత వన్నె తీసుకురాగలదని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమాండ్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. సంస్థ 30 ఏళ్ల వేడుకల సందర్బంగా అలియాతో జట్టు కట్టినట్లు మలబార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎంపి అహ్మాద్‌ పేర్కొన్నారు. ఈ సంస్థ 10 దేశాల్లో 312 షోరూంలను కలిగి ఉంది.