యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడోరౌండ్‌కు టాప్‌సీడ్, స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన రెండోరౌండ్ పోటీలో అల్కరాజ్ 6-3, 6-1, 7-6(7-4)తో హారిన్(దక్షిణాఫ్రికా)ను వరుససెట్లలో ఓడించాడు. ఇక రష్యాకు చెందిన 3వ సీడ్ మెద్వదెవ్ 6-2, 6-2, 6-7(6-8), 6-2తో ఒకానెల్(ఆస్ట్రేలియా)ను, 8వ సీడ్ రుబ్లేవ్ 6-4, 6-3, 2-6, 6-1తో మోన్‌ఫీల్(ఫ్రాన్స్)ను చిత్తుచేశారు. ఇక ఇంగ్లండ్ మాజీ నంబర్‌వన్ ఆటగాడు ఆండీ ముర్రే 3-6, 4-6, 1-6తో 19వ సీడ్ డిమిట్రోవ్(బల్గేరియా) చేతిలో ఓటమిపాలవ్వగా.. 12వ సీడ్ జ్వెరేవ్(జర్మనీ) 7-6(7-1), 3-6, 6-4, 6-3తో సహచర ఆటగాడు అల్టేయర్‌ను చిత్తుచేశాడు. మరో పోటీలో 17వ సీడ్ పోలండ్‌కు చెందిన హుర్క్‌రాజ్ 2-6, 4-6, 5-7తో డ్రేవెన్(బ్రిటన్) చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు.
స్విటోలినా, కసట్కినా కష్టంగా..
మహిళల సింగిల్స్‌లో 13వ సీడ్, కసట్కినా, 25వ సీడ్ స్విటోలినా కష్టంగా గెలిచారు. ఉక్రెయిన్‌కు చెందిన స్విటోలినా 5-7, 6-4, 6-4తో రష్యాకు చెందిన పాహ్లియుచెంకోవాపై, రష్యాకు చెందిన కసట్కినా 2-6,న 6-4, 6-4తో అమెరికాకు చెందిన కెనిన్‌ను ఓడించారు. ఇతర పోటీల్లో 3వ సీడ్ పెగూలా 6-3, 6-1తో పిఎం టింగ్(రొమేనియా)పై, 5వ సీడ్, ట్యునీషియాకు చెందిన జబీర్ 7-5(9-7), 4-6, 6-3తో నోస్కోవా(చెక్)పై చెమటోడ్చి నెగ్గారు. ఇక 17వ సీడ్ కీస్ 6-1, 6-2తో విక్‌మెయిర్(బెల్జియం)పై, 2వ సీడ్ సబలెంకా 6-3, 6-2తో అన్నా బర్రేజ్(బ్రిటన్)పై సునాయాసంగా నెగ్గి మూడోరౌండ్‌కు చేరారు.










