Apr 19,2023 21:00

న్యూఢిల్లీ : అక్షయ తృతీయ సందర్బంగా తమ వినియోగదారులకు భారీగా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అందిస్తున్నట్లు ఫోన్‌ పే తెలిపింది. తమ యాప్‌ ద్వారా ఏప్రిల్‌ 22న ఒక్క గ్రాము లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణంలో డిజిటల్‌ బంగారం కొనుగోలు చేసే వారికి రూ.50 నుండి రూ.500 వరకు క్యాష్‌ బ్యాక్‌ తప్పనిసరి ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. తాము నిల్వ చేసిన బంగారాన్ని ఏ సమయంలో విక్రయించినా, 48 గంటల్లో దానికి సంబంధించిన డబ్బు వారి బ్యాంక్‌ ఖాతాలకు జమ అవుతుందని తెలిపింది.