Feb 20,2023 08:18

ప్రముఖ కవి, కథారచయిత కాశీభట్ల వేణుగోపాల్‌ అక్షరం లిటరరీ ట్రస్ట్‌ అనే సాహిత్య సాంస్క ృతిక సంస్థను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యరంగంలో కృషి చేస్తున్నవారికి, కవులకు, కళాకారులకు ప్రతి ఏడాది అక్షరం ట్రస్టు పురస్కారాలను ఇస్తుంది. ప్రముఖ కవి జి.వెంకటకృష్ణ కార్యదర్శిగానూ, మరికొంతమంది కవులు సాహిత్యాభిమానులతో ఈ ట్రస్టీ ఏర్పాటైంది. ఈ ఏడాది అక్షరం ట్రస్టు తొలి పురస్కారం కథారచయిత వెంకట్‌ సిద్ధారెడ్డికి ప్రకటించారు. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశం హాలులో ఈనెల 26న ఆదివారం ఉదయం పురస్కార ప్రదాన సభ జరుగుతుంది. రూ.25 వేల నగదు, మెమొంటోతో సత్కరిస్తారు.