Nov 13,2022 06:44

దున్నే రైతుకు భూమి లేదు
పేదవాడికి జానెడు స్థలం లేదు
భూ కబ్జాలకు అదుపు లేదు
పాలించే భూస్వాములకు జాలి లేదు.

గ్రామాల్లో ఉపాధి కరువు
చదువుకున్నా కొలువుల కరువు
పట్టణాల్లో చేద్దామన్నా నౌకరి కరువు
జానెడు పొట్టకు నాలుగు మెతుకులు కరువు.

అలమటిస్తున్న పేగులు
అలసిపోతున్న బతుకులు
బక్క చిక్కిన శ్రామికుల ఆర్తనాదాలు
దేశ ప్రజల ఆకలి కేకలు.

ఆకలి, పేదరికం, నిరుద్యోగం
అవినీతి, అన్యాయం, అక్రమాలు
మతోన్మాదం అలుముకున్న ఈ దేశం
ఎటువైపు గమ్యం? ఆకలి సూచీలో
ప్రపంచంలో 107వ స్థానం.

ఇదేనా ప్రజలు కలగన్న స్వరాజ్యం?
ఇదేనా భావి భారత భవితవ్యం?
ప్రాథమిక హక్కులకై యోచించి
ప్రశ్నించాలి ప్రభుత్వాలని
ప్రజలందరం.

- ఎస్‌.కె. బాజీ సైదా
సెల్‌ : 8897282981