న్యూఢిల్లీ : రోజుకు రూ.133 కన్నా తక్కువతో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ అందిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. ఇది ఆయా దేశాలలోని ఇతర నెట్‌వర్క్‌లు అందించే ధరలతో పోల్చితే చౌక అని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వినియోగదారుల ప్యాక్‌ల సబ్‌స్క్రిప్షన్లలో 102 శాతం వృద్థిని సాధించినట్లు వెల్లడించింది. నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డిపార్చర్ టెర్మినల్‌లో ఎయిర్‌టెల్ తన రోమింగ్ కియోస్క్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.










