May 01,2023 21:01

న్యూఢిల్లీ : గ్లోబల్‌ ఛానెల్‌ పార్ట్‌నర్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా బ్రిడ్జీపాయింటెతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో భారత్‌, ఆఫ్రికా దేశాల్లో తమ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ సొల్యూషన్స్‌కు బ్రిడ్జీపాయింట్‌ మద్దతును ఇవ్వనుందని తెలిపింది. ఈ ఒప్పందం తమ ఖాతాదారులు మరింత పెరగడానికి దోహదం చేయనుందని భారతీ ఎయిర్‌టెల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సిఇఒ వాణి వెంకటేష్‌ పేర్కొన్నారు.