Aug 08,2023 20:39

న్యూఢిల్లీ : ఫిన్‌టెక్‌ సంస్థ ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డెబిట్‌ కార్డ్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. దేశంలోనే తొలిసారి పర్యావరణ అనుకూల పదార్థం ఆర్‌ పివిసి మెటీరియల్‌తో తయారు చేసినట్లు పేర్కొంది. తమ సంస్థలో సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాతో కొత్త, ఇప్పటికే ఖాతాదారులుగా ఉన్న వారు దీన్ని పొందవచ్చని వెల్లడించింది. ఆర్‌పిసి కార్డులతో హైడ్రోకర్బన్‌ వినియోగంలో 43 శాతం తగ్గించొచ్చని పేర్కొంది. ఈ కార్డ్‌ ద్వారా రూ.10,000 వరకు ఇ-కామర్స్‌ ప్రయోజనాలు పొందవచ్చని ఆ సంస్థ సిఒఒ గణేష్‌ అనంతనారాయణన్‌ పేర్కొన్నారు.