న్యూఢిల్లీ : ప్రయివేటు టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ దేశంలో 3000 పైగా నగరాలు, పట్టణాల్లో 5జి సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు గురువారం ప్రకటించింది. ఇక జమ్మూలోని కత్రా నుంచి కేరళలోని కన్నూర్ వరకు, బిహార్‌లోని పాట్నా నుంచి తమిళనాడులోని కన్యాకుమారి, ఇటా నగర్ నంచి డామన్ డయ్యూ వరకు అనేక నగరాల్లో తమ అపరిమిత 5జి సేవలను పొందవచ్చని పేర్కొంది. ''2023 సెప్టెంబర్ నాటికి ప్రతీ పట్టణం, కీలక గ్రామాలకు తమ 5జి సేవలను విస్తరించనున్నాము. ప్రతీ రోజు 30-40 నగరాల్లో కొత్తగా 5జి సేవలను ప్రారంభిస్తున్నాం.'' అని భారతీ ఎయిర్‌టెల్ సిటిఒ రందీప్ సెఖోన్ తెలిపారు.










