Mar 24,2023 21:23

న్యూఢిల్లీ : టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ 5జి సేవల విస్తరణలో దూసుకుపోతోంది. కొత్తగా 235 ప్రాంతాలకు 5జి సేవలను అందించడం ద్వారా దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు 5జి నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు శుక్రవారం ఆ కంపెనీ తెలిపింది. 2022 అక్టోబర్‌లో మొదటగా 5జి సర్వీసులను ప్రారంభించింది. ప్రతి ఎయిర్‌టెల్‌ వినియోగదారునికి 5జి సేవలు అందుబాటులో తీసుకురావటమే లక్ష్యంగా రోజుకు 30-40 నగరాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వచ్చే సెప్టెంబర్‌ నాటికి దేశంలోని నగరాలన్నింటికీ 5జి అందించాలని నిర్దేశించుకున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది.