Feb 11,2023 21:23

ముంబయి : ఎయిర్‌ ఏసియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) భారీ జరమానా విధించింది. పైలెట్ల శిక్షణలో వైఫల్యం చెందినందుకు రూ.20 లక్షల జరిమానా వేసింది. అంతర్జాతీయ పౌర విమానయాన రెగ్యూలేటరీ నిబంధనల ప్రకారం విమానాన్ని నడిపే పైలట్‌కు సామర్థ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు కొన్ని కచ్చిమైన చర్యలు పాటించాలి. వాటిని పాటించడంలో ఆ సంస్థ వైఫల్యం చెందిందని డిజిసిఎ పేర్కొంది. డిజిసిఎ నిబంధనల మేరకు విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించిన ఎయిర్‌లైన్స్‌ శిక్షణ విభాగ అధిపతిని మూడు నెలల పాటు తొలగిస్తూ చర్యలు తీసుకుంది. అలాగే ఎనిమిది మంది సూపర్‌వైజర్లకు రూ.3 లక్షల చొప్పున జరిమానా వేసింది. ఈ అంశంలో ఏయిర్‌ ఆసియాకు నోటీసులు జారీ చేసింది.