Sep 17,2023 13:54

వన్డే ప్రపంచ కప్‌ ముందు భారత జట్టును గాయాలు కలవర పెడుతున్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టులో చేరిన స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మళ్లీ వెన్ను నొప్పికి గురయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోతే ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు అతని స్థానంలో తిలక్‌ వర్మను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా స్పిన్‌ ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కాలు, ముంచేయి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. బంగ్లాదేశ్‌ తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో అక్షర్‌కు కండరాల గాయంతో పాటు బంతి తగిలి ముంజేతికి గాయం అయింది. శ్రీలంకతో జరిగే ఆసియా కప్‌ ఫైనల్‌ నుంచి అతను వైదొలగ్గా.. వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి చేర్చారు. అక్షర్‌ పూర్తిస్థాయిలో కోలుకోకపోతే వాషింగ్టన్‌ సుందర్‌ను ప్రపంచ కప్‌ జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.