హార్సీలీహిల్స్ను సందర్శించిన వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ప్రజాశక్తి- బి.కొత్తకోట (అన్నమయ్య) : మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్‌కు మంగళవారం ఉదయం విచ్చేశారు. అల్పాహారం తర్వాత కొండపై విస్తృతంగా పర్యటించి, ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన గవర్నర్ బంగ్లా వి పాయింట్ గాలిబండ ఫారెస్ట్ బంగ్లాను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ... భారతదేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన హార్సీలీహిల్స్ ప్రకృతి రమణీయంగా ఉందని, ఇక్కడ అందాలు తనని మంత్రముగ్దుడిని చేశాయని కితాబునిచ్చారు. అనంతరం ఆయన హార్సీలీహిల్స్ వద్ద మార్కెట్ యార్డ్ చైర్మన్ డియర్ ఉమాపతి రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ వసంత్ రెడ్డి, నాయకులు మంత్రి గోవర్ధన్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.










