Jul 27,2023 17:17

ప్రజాశక్తి-నందిగామ(ఎన్టీఆర్‌ జిల్లా) : నందిగామ మండలం కంచల గ్రామంలో 10మంది వ్యవసాయ కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం పొలానికి మందు కొట్టడానికి 10 మంది కూలీలు వెళ్లారు. ఈ క్రమంలో మున్నేరు వాగుకు ఒక్కసారిగా వరద రావడంతో వారు వరదలో చిక్కుకుపోయారు. కాపాడండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు.. చేస్తున్నారు. ఇప్పటివరకు సహాయక చర్యలు ప్రారంభించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది.