
- మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ షాంటో హాఫ్ సెంచరీలు
ధర్మశాల : ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో బంగ్లాదేశ్ తొలి విజయం సాధించింది. ధర్మశాలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపిందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ఆఫ్ఘాన్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 37.2 ఓవర్లలో 156 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రెహ్మనుల్లా గుర్భాజ్ 62 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇబ్రహీం జాద్రాన్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేయగా రెహ్మత్ షా 18, ఆఫ్ఘాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 18, నజీబుల్లా జాద్రాన్ 5, మహ్మద్ నబీ 6 పరుగులు చేశారు. అజ్మతుల్లా ఓమర్జారు 22 పరుగులు చేయగా రషీద్ ఖాన్ 9, ముజీబ్ వుర్ రహీం 1 పరుగు చేయగా నవీన్ ఉల్ హక్ 6 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ మూడేసి వికెట్లు తీయగా షోరిఫుల్ ఇస్లాం 2 వికెట్లు తీశారు. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లకు చెరో వికెట్ దక్కింది..
అనంతరం లక్ష్య చేదనలో బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.తంజీద్ హసన్ 5, లిటన్ దాస్ 13, , కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 14 నిరాశ పరిచిన నజ్ముల్ హుస్సేన్ షాంటో 59, మెహిదీ హసన్ మిరాజ్ 57 పరుగులు చేసి బంగ్లాను గెలిపించారు.
- 156 పరుగులకే అఫ్గానిస్థాన్ అలౌట్
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్-అఫ్గానిస్థాన్ తన తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ కీలక సమయంలో వికెట్లను చేజార్చుకుని కుప్పకూలింది. బంగ్లాకు 157 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (47), ఇబ్రహీం జాద్రాన్ (22) తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన రహ్మత్ షా (18), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (18), లోయర్ ఆర్డర్‌లో అజ్మాతుల్లా ఒమర్జారు (22) కాస్త బ్యాట్‌ను ఝుళిపించాడు. రషీద్ ఖాన్ (9), నబీ (6) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లు మెహిదీ హసన్ 3, షకిబ్ 3, షోరిఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీయగా .. తస్కిన్, ముస్తాఫిజర్ చెరో వికెట్ తీశారు.