ఇంటర్నెట్ డెస్క్ : యాపిల్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర కంపెనీల బాటలోనే యాపిల్ నడవనుంది. త్వరలో యాపిల్ ఉత్పత్తుల్లోనూ ఆండ్రాయిడ్ తరహా ప్రకటనలు రానున్నాయి. త్వరలోనే ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ యూజర్లకు పాడ్‌కాస్ట్, మ్యాప్స్, న్యూస్, మ్యూజిక్, మెసేజ్‌తోపాటు ఇతర యాప్‌లలో ప్రకటనలు కనిపిస్తాయి. అయితే ఇప్పటివరకు యాపిల్ ఉత్పత్తుల్లో ఎలాంటి ప్రకటనలు రాకపోవడం వల్లే కొలుగోలుదారులు ఈ ఉత్పత్తులపై ఆసక్తి చూపేవారు. అలాగే యాపిల్ యూజర్ల డేటా కూడా సురక్షితంగా ఉండేది. అయితే యాపిల్ తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల...వారి డేటా సురక్షితంగా ఉండదేమోనని యూజర్లు ఆందోళన చెందుతున్నారు.అయితే యూజర్లు యాడ్స్‌ను వద్దనుకుంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్లో పర్సనలైజ్డ్ యాడ్స్‌పై క్లిక్ చేసి వాటిని నియంత్రించుకునే అవకాశాన్ని కల్పిస్తోందట. యాపిల్ తీసుకున్న తాజా నిర్ణయం యాప్ డెవలపర్స్‌కు మేలు చేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. యాపిల్ కంపెనీ రెవెన్యూ పెంచుకునే భాగంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.










