Oct 18,2023 17:06

అమరావతి: మార్గదర్శి క్వాష్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది. యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తును 8 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులు యూరిరెడ్డి, సీఐడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది.