Oct 20,2023 11:17

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు లీగల్‌ ములాఖత్‌ల పెంపు పిటిషన్‌ను ఎసిబి కోర్టు తిరస్కరించింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో టిడిపి అధినేత చంద్రబాబు లీగల్‌ ములాఖత్‌లకు అధికారులు కోత విధించిన సంగతి విదితమే. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉండటంతో రోజుకు మూడు సార్లు ములాఖత్‌ పెంచాలని చంద్రబాబు తరపున ఎసిబి కోర్టులో న్యాయవాదులు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ... శుక్రవారం ఉదయం విజయవాడ ఎసిబి కోర్టులో దీనిపై విచారణ వచ్చింది. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలపడంతో ఇకపై రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌ ఉండనుంది.