Jul 25,2023 12:04

విశాఖ : విశాఖ జిల్లాలో ఉన్న అదాని గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతూ ... మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద విశాఖలోని పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. అనంతరం నేతలంతా కలిసి కలెక్టర్‌కి వినతిపత్రాన్ని సమర్పించారు.

అదానీ గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని నేతలు లేఖలో కోరారు. అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 04-07-2023 నుండి కార్మికులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వాలు, యాజమాన్యం ఇంతవరకు కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు. దీంతో కార్మికులు, కార్మిక కుటుంబాలు తీవ్ర కష్టాల్లో పడటంతోపాటు యాజమాన్య, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తీవ్ర అసంతఅప్తితో ఉన్నారని... వీరందరూ అత్యంత బలహీనవర్గాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు చెందినవారని చెప్పారు. వీరి అసంతఅప్తి తీవ్ర ఆగ్రహంగా మారి పారిశ్రామిక అశాంతికి దారితీయకముందే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని విశాఖ జిల్లా అఖిలపక్ష రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా విజ్ఞప్తి చేస్తున్నాయని అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.22 వేలతోపాటు రూ.36 వేలు ఇవ్వాలన్నారు. అన్యాయంగా తొలగించిన 29మంది యూనియన్‌ నాయకులను, కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు తగు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కోరారు. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ పరిధిని రద్దుచేసి ఫ్యాక్టరీ యాక్ట్‌ పరిధిలోకి తేవాలన్నారు. కార్మికులపై నిర్భంధం ఆపాలని, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కారానికి కార్మికులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపించాలన్నది కార్మికుల న్యాయమైన కోర్కెలు అని తెలిపారు. దీనికి వెంటనే తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గంగవరం పోర్టు నిర్మాణానికి నిర్వాసితులు తమ ఇళ్లను, భూములను, సముద్రవేట, ఉపాధిని త్యాగం చేశారని గుర్తు చేశారు. గంగవరం పోర్టు భూములు 1800 ఎకరాలు ప్రజలవి అని చెప్పారు. పోర్టు వస్తే తమకు శాశ్వత ఉపాధి లభించి జీవితాలు సుఖమంతమవుతాయని నిర్వాసితులు కలలుగన్నారనీ, ఈ కలలను యాజమాన్యం కల్లలు చేస్తున్నదని నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోర్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను యాజమాన్యం మోసం చేసిందని ఆరోపించారు. ప్రాధాన్యత లేని పనులను కొంతమంది నిర్వాసితులకు ఇచ్చిందని అన్నారు. పర్మినెంటు కార్మికులకిచ్చే జీతాలు ఇస్తామని చెప్పి జిపిఎల్‌, జిపిఎస్‌ కార్మికుల పేరుతో అతి తక్కువ జీతాలతో దోపిడీ చేస్తున్నదన్నారు. 14సంవత్సరాలకుపైగా పని చేస్తున్న కార్మికులకు నెలకు కేవలం రూ.13 వేల నుండి రూ. 16 వేలు, 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి నెలకు రూ.9 వేలు నుండి 9,700 రూపాయలు మాత్రమే చెల్లిస్తోందన్నారు. ఉద్యోగంలో చేరిన నాటి బేసిక్‌ నెలకు రూ.3,700లనే నేటికీ కొనసాగించడం యాజమాన్య దోపిడీకి నిదర్శనం అని అన్నారు. 3 వేల మందికి పైగా పనిచేస్తున్న అదానీ గంగవరం పోర్టును షాప్స్‌ Ê ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టు పరిధిలో ఉంచడం అన్యాయమని, దీనిని ఫ్యాక్టరీ యాక్టు పరిధిలో తేవాలని కోరారు. చట్టపరమైన హక్కులు పొందటం, యూనియన్‌ ఏర్పాటు చేసుకోవడం కార్మికుల హక్కు. దీనిని యాజమాన్యం సహించకపోవడం, కార్మిక నాయకులు, కార్మికులు 29మందిని విధులు నిలిపివేయడం చట్ట విరుద్ధం అని అన్నారు. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం గతేడాది 2 వేల కోట్ల టర్నోవర్‌లో రూ.700 కోట్లు నికర లాభం ఆర్జించిందన్నారు. అయినా కార్మికులను కష్ణాల్లోకి నెట్టిందని చెప్పారు. గంగవరం, గంట్యాడ, గాజువాక, మల్కాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు కాలుష్యాన్ని వెదజల్లి ఆరోగ్యాలను హరిస్తోందన్నారు. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం కోట్లాది రూపాయలు లాభాలార్జించి, లాభాలకు కారణమైన కార్మిక చట్టాలను ఉల్లంఘించడం, కార్మికులను బెదిరించడం, అన్యాయంగా తొలగించడం వంటి చర్యలు చట్ట విరుద్ధం అని అన్నారు. కలెక్టర్‌ వెంటనే కలుగజేసుకొని అదానీ గంగవరం పోర్టు యాజమాన్యంపై చర్యలు తీసుకొని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎం.డి.నజీర్‌, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు వై.కొండయ్య, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ ఇ.చంద్రశేఖర్‌, సిపిఐఎంఎల్‌ ప్రజాపోరు నాయకులు దాసు, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.సుధాకర్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.జగన్‌, హెచ్‌.ఎం.ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు డి.అప్పారావు, ఐఎన్‌టియుసి జిల్లా కార్యదర్శి కె.ఈశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.కఅష్ణారావు, గంగవరం పోర్టు యూనియన్‌ నాయకులు వై.ఎల్లాజి, కె.వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.