Aug 14,2023 07:22

ప్రముఖ కవి, విమర్శకుడు అద్దేపల్లి రామమోహనరావు సాహిత్య విమర్శ పురస్కారం 2023వ సంవత్సరానికి గానూ ప్రముఖ విమర్శకుడు మేడిపల్లి రవికుమార్‌ (తిరుపతి)కి ప్రదానం చేస్తున్నాం. మేడిపల్లి రవికుమార్‌ విమర్శకునిగా కవిత్వ వక్తగా ఎంతోమందిని ఉత్తేజితుల్ని చేసినవారు. తెలుగు కవిత్వంపై సాధికారికంగా వ్యాఖ్యానించగలిగిన విమర్శకుల్లో ఒకరు. 2017 నుంచి తెలుగులో కవిత్వ విమర్శకు అద్దేపల్లి రామమోహనరావు పేరిట ఆయన జన్మదిన సందర్భంగా సెప్టెంబర్‌లో కవిత్వ విమర్శ పురస్కారం ఇస్తున్నాం. 2017లో రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, 2018లో కడియాల రామమోహనరారు, 2019లో కాత్యాయనీ విద్మహే లకు ఈ పురస్కారం ఇచ్చాము. 2020లో కరోనా కారణంగా ఇవ్వలేదు. 2021లో పాపినేని శివశంకర్‌కు, 2022లో కె.పి. అశోక్‌ కుమార్‌కు ఈ పురస్కారాన్ని ఇచ్చాము. 2023వ సంవత్సరానికి గానూ మేడిపల్లి రవికుమార్‌కు ఈ పురస్కారం ఇస్తున్నాము. అద్దేపల్లి రామమోహనరావు జన్మదిన మాసం సెప్టెంబర్‌ 9వ తేదీన కాకినాడలో జరిగే సభలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరగనుంది
 

- అద్దేపల్లి ఉదయభాస్కరరావు, కన్వీనర్‌
అద్దేపల్లి సాహిత్య విమర్శ పురస్కార వేదిక