Feb 11,2023 21:13

న్యూఢిల్లీ : అదాని గ్రూపునకు చెందిన మూడు కంపెనీల షేర్లను తనఖాగా పెట్టుకున్నామని ఎస్‌బిఐ క్యాప్‌ ట్రస్టీ కో వెల్లడించింది. దీంతో రుణాలు ఇచ్చినట్లు బిఎస్‌ఇకి సమాచారం ఇచ్చింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లను తనఖాగా పెట్టుకున్నట్లు ఎస్‌బిఐకి చెందిన ఈ సంస్థ వెల్లడించింది. అయితే ఈ షేర్లపై ఎంత రుణం ఇచ్చిందనే అంశాన్ని ఎస్‌బిఐ క్యాప్‌ వెల్లడించలేదు. అమెరికన్‌ సంస్థ హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బకు జనవరి 24 నుంచి అదానీ కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చవి చూస్తున్న విషయం తెలిసిందే.