Jun 28,2023 13:05

ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్‌) : నందిగామ మండలం కొణతమాత్మకూరు గ్రామంలో దేవాలయ భూమి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు బుధవారం నందిగామ ఆర్డీవో రవీంద్రరావు, ఎసిపి జనార్ధన్‌ నాయుడు, సిఐ హనీష్‌ కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో వేజెండ్ల కోటయ్య సహిత భక్తాంజనేయ స్వామి దేవాలయమునకు సంబంధించి గ్రామ కంఠం సర్వే నెంబర్‌ 132 వద్ద పూరా విస్తీర్ణం 20.20 సెంట్లు భూమి లో దేవాలయ భూమి 0.66 సెంట్లు విస్తీర్ణం ఉందని అన్నారు. సదరు భూమిని కొణతమాత్మకూరు గ్రామానికి చెందిన జవ్వాజి లీలావతి కొంత భాగమును ఆక్రమించి పశువుల మేత వేసుకొని దేవాలయ దర్శనమునకు, దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమమునకు వచ్చే ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారని తెలిపారు. ఈ దేవాలయానికి దక్షిణ భాగమున మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఉందని, సదరు ఆలయమునకు వచ్చే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. వాస్తవాలు విచారించి ఆలయ భూమిని సర్వే చేయించి ఆక్రమణదారుని తొలగించాలని డిమాండ్‌ చేశారు. దేవాలయ భూమికి సరిహద్దు రాళ్లు గ్రాసెరీ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు.