హైదరాబాద్ : ఎసిడిటి, గుండెల్లో మంటను తగ్గించడంలో సహాయపడే గావిస్కాన్ డబుల్ యాక్షన్ సిరప్‌ను ఆవిష్కరించినట్లు రెకిట్ తెలిపింది. ఆరోగ్యం, పోషకాహారం ఉత్పత్తుల కంపెనీ రెకిట్ ఈ కొత్త సిరప్‌ను తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసినట్లు శనివారం వెల్లడించింది. కడుపులో మంట వంటి లక్షణాలను గుర్తించడం చాలా కీలకం, ఛాతీలో అసౌకర్యాన్ని తగ్గించడానికి గావిస్కాన్ ఉపయోగపడుతుందని ఆ సంస్థ తెలిపింది.