హైదరాబాద్ : ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌ల తయారీదారు ఎసర్ కొత్తగా ద్విచక్ర విద్యుత్ వాహన రంగంలోకి ప్రవేశించింది. భారత్ మార్కెట్లోకి ఈబైక్‌గో స్టార్టప్‌తో కలిసి ఎంయువిఐ125 4జి ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.99,999గా నిర్ణయించింది. త్వరలోనే ప్రీబుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు ఎసర్ ఐఎన్‌సి గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ వైస్ ప్రెసిడెంట్ జాడె జో తెలిపారు. పట్టణ వాసులకు తమ ఈ వాహనం చాలా సౌలభ్యంగా ఉంటుందని థింక్ ఇబైక్ గో సిఇఒ ఇర్ఫాన్ ఖాన్ పేర్కొన్నారు.