Apr 10,2023 21:33

న్యూఢిల్లీ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఇండ్కల్‌ కొత్తగా ఏసర్‌ లార్జ్‌ బ్రాండ్‌పై ప్రీమియం ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మిషన్లను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఏసర్‌ లార్జ్‌ పేరుతో తన డబ్ల్యు సీరిస్‌లో క్యూఎల్‌ఇడి స్మార్ట్‌ టివిలను కూడా విడుదల చేసినట్లు పేర్కొంది. 65, 75 అంగుళాల పరిమాణంలో వీటిని ఆవిష్కరించినట్లు ఏసర్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాడే జౌ తెలిపారు. ఎసి ధరలు రూ.27,999 నుంచి, ప్రీమియం వాషింగ్‌ మిషన్ల ధరలు రూ.13,499 నుంచి ప్రారంభమవుతాయని ఆ సంస్థ తెలిపింది.