మన ఆడబిడ్డను ఊరేగిస్తున్నారు నగ్నంగా
నిస్సహాయమైన మూగదేశం పిరికి కళ్ళతో చూస్తోంది !
మతం విద్వేషమనే భక్తిలో తరిస్తోంది
విఫలమైనవారే వాడుకుంటారు కులాన్ని మతాన్ని
జీవించే హక్కును కాల్చేస్తూ
వ్యాపిస్తున్నాయి మతం మంటలు
ఆకాశం సైతం చిరునవ్వును మరచినట్టు, సర్వత్రా భయం!
స్వేచ్ఛాదారి దగ్గర్లోనే ముగిసిపోతుందని తెలుస్తోంది
ఏం జరిగినా నవ్వుతున్నవాళ్ళు కొందరు
ఎలాంటి ప్రతిఘటనా లేకుండా
లొంగిపోతున్నవాళ్ళు ఇంకొందరు
ఇక లోపల మరణించి పైకి బతికుంటాం!
మాకే దేవుడూ తెలియదు
తాగడానికి కొన్ని నీళ్ళివ్వండి
సహపంక్తి భోజనం చేయనివ్వండి
మా అభి'మతం' ద్వేషం కాదు
ఆత్మగౌరవం.....
దాని కోసమే మా పోరాటం
నిప్పు పెట్టిన కళాకారుడివి
చాలా తీరుబడిగా ఉంటావు
శూద్రుల కన్నీరు మీరు
ఆమె కన్నీళ్ళను దొంగిలించేందుకు పూనుకున్నారు
కంటి మూలలో చిక్కుకున్న
మిగిలిన కాటుకనూ కడిగేసింది కన్నీరు!
- శాంతయోగి యోగానంద
9110770545










