Nov 13,2023 09:53

ఉత్తరప్రదేశ్‌ : దీపావళి పండుగ వేళ ... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌లో దుర్ఘటన జరిగింది. దీపావళి రోజు సాయంత్రం రసూలాబాద్‌ నుంచి కాన్పూర్‌ నగర్‌ వెళ్లే రోడ్డులో పలువురు పటాకులు, మిఠాయిలు కొంటుండగా... రసూలాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెద్ద శబ్ధంతో బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. భారీ పేలుడు ధాటికి సమీపంలోని కొంతమంది 20 అడుగుల మేర గాలిలో ఎగిరిపడ్డారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సుఫియాన్‌ మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాన్పూర్‌ ఆసుపత్రికి తరలించారు. సాధారణ పటాకుల వల్ల పేలుడు సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.