Oct 12,2023 21:12

న్యూఢిల్లీ : ప్రముఖ ఐటి సంస్థ యాక్సెంచర్‌ భారత ఉద్యోగుల పట్ల పక్షపాత దోరణీని అవలంభిస్తోంది. భారత్‌, శ్రీలంకలో తమ ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపుతో పాటు అధిక బోనస్‌ చెల్లింపులు ఉండవని స్పష్టం చేసింది. అదే విధంగా పదోన్నతులను కుదించనున్నట్లు సమాచారం. కాగా.. రెండు అంశాలు కూడా కొన్ని విభాగాలకు వర్తించదని యాక్సెంచర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజరు విజ్‌ తమ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుత ఏడాది ఉద్యోగులకు వేతన పెంపును కంపెనీ చేపట్టడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఒకటి నుంచి నాలుగు లెవెల్స్‌ వరకూ పదోన్నతులను 2024 జూన్‌ వరకూ వాయిదా వేస్తున్నామన్నారు. ఇక భారత్‌లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు యాక్సెంచర్‌లో పనిచేస్తున్నారు. 2023 మార్చిలో ఏకంగా 19,000 మంది ఉద్యోగులను తొలగించింది.