Aug 03,2023 21:18

వాషింగ్టన్‌ : క్లౌడ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సేల్స్‌ఫోర్స్‌ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు పాల్పడింది. ప్రపంచ వ్యాప్తంగా తమకున్న ఉద్యోగుల్లో 10 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. ఏడాది ప్రారంభంలోనూ ఈ సంస్థ 7వేల మంది సిబ్బందిని ఇంటికి పంపించింది. ఈసారి సేల్స్‌, కస్టమర్‌ సక్సెస్‌ టీమ్‌ సభ్యుల ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయని ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 8000 మంది ఉద్యోగులను సాగనంపాలని సేల్స్‌ఫోర్స్‌ ప్రణాళికలు రూపొందించుకున్నట్లు పేర్కొంది.